విక్రమ్ కుమార్ మూవీలో విలన్ గా 'ఆర్ ఎక్స్ 100 హీరో?
- నాని హీరోగా విక్రమ్ కుమార్ మూవీ
- డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన విలన్ పాత్ర
- కార్తికేయతో సంప్రదింపులు
ఈ సినిమాలో విలన్ పాత్రను విక్రమ్ కుమార్ చాలా వెరైటీగా డిజైన్ చేశాడట. 'ఆర్ ఎక్స్ 100' సినిమాలో కార్తికేయను చూసిన ఆయన, నాని సినిమాలో విలన్ పాత్రను కార్తికేయతో చేయిస్తే బాగుంటుందని భావించాడట. తాను అనుకున్న ఆ విలన్ పాత్రకు కార్తికేయ అయితే సరిగ్గా సరిపోతాడనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించినట్టు సమాచారం. విక్రమ్ కుమార్ సినిమా కావడం .. విలన్ పాత్రలో కొత్తదనం ఉండటం వలన ఈ సినిమా చేయడానికి కార్తికేయ సుముఖతను వ్యక్తం చేశాడనే ప్రచారం జరుగుతోంది. హీరోగా రెండు సినిమాలు చేస్తోన్న కార్తికేయ .. విక్రమ్ కుమార్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి.