'మిస్టర్ మజ్ను' నాలుగు రోజుల వసూళ్లు
- ఈ నెల 25న వచ్చిన 'మిస్టర్ మజ్ను'
- నాలుగు రోజుల్లో 9.6 కోట్ల షేర్
- ఫుల్ రన్ లో 15 కోట్లు రావొచ్చనే అంచనా
అఖిల్ గత చిత్రాలకంటే ఓపెనింగ్స్ తక్కువగా వచ్చినప్పటికీ, ఆ తరువాత వసూళ్లు పుంజుకుంటాయని భావించారు. కానీ నాలుగు రోజుల్లో ఈ సినిమా 9.6 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. సోమవారం నుంచి వసూళ్లు మరింత డ్రాప్ కావడంతో, ఫుల్ రన్ లో ఈ సినిమా 15 కోట్ల వరకూ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ కి .. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పకపోవచ్చని చెప్పుకుంటున్నారు. మూడవసారి కూడా అఖిల్ కి హిట్ దక్కకపోవడం అభిమానులను నిరాశపరిచే విషయమే.