'మిస్టర్ మజ్ను' తొలిరోజు వసూళ్లు
- నిన్ననే థియేటర్లకు వచ్చిన 'మిస్టర్ మజ్ను'
- లుక్ పరంగా .. డాన్స్ పరంగా మంచి మార్కులు
- వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున 3 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే అఖిల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా రాబట్టిన తొలిరోజు వసూళ్లు తక్కువగా ఉండటం అభిమానులను నిరాశ పరుస్తోంది. మొదటి చిత్రమైన 'అఖిల్' తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 7 కోట్ల షేర్ ను వసూలు చేసింది. రెండవ చిత్రమైన 'హలో' తొలిరోజున 3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక 'మిస్టర్ మజ్ను' మాత్రం 3 కోట్ల షేర్ కి పరిమితమైపోయింది. వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.