రవితేజ పుట్టినరోజున రానున్న ఫస్టులుక్
- వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ
- స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టు ప్రకటన కూడా అదేరోజు
ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ నెల 26వ తేదీన రవితేజ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆ రోజున టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికలుగా నాభా నటేష్ .. పాయల్ రాజ్ పుత్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడనుందని సమాచారం.