హైదరాబాదులో అయితే తాకిడి ఎక్కువని.. ముంబైలో ఆపరేషన్ చేయించుకున్న బ్రహ్మానందం!
- సంక్రాంతి నాడు బైపాస్ సర్జరీ
- నిలకడగా ఉన్న ఆరోగ్యం
- వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే
ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకుంటే అభిమానులతో ఇబ్బందులుంటాయన్న కారణంగానే ముంబైకి ఆయన్ను తీసుకెళ్లామని, ఆపరేషన్ విజయవంతం అయిందని వెల్లడించాయి. కాగా, దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం త్వరగా కోలుకుని, తిరిగి నవ్వులు పండించాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.