సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- త్రిష కు పెరుగుతున్న డిమాండ్
- సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ
- 'మహానాయకుడు' విడుదల వాయిదా?
* రవితేజ తన తదుపరి చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. మొదట్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని ముందుగా చేయాలనుకున్నప్పటికీ, కారణాంతరాల వల్ల సంతోష్ శ్రీనివాస్ ప్రాజక్ట్ ముందుకు వచ్చినట్టు సమాచారం. ఇందులో కేథరిన్ త్రెసా కథానాయికగా నటిస్తుంది.
* బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' విడుదల వాయిదా పడచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 7న ఇది విడుదల కావాలి. అయితే, చిత్రం క్వాలిటీ పట్ల మరింత కేర్ తీసుకుంటున్న నేపథ్యంలో విడుదల వాయిదా పడచ్చని అంటున్నారు.