సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రకుల్ సినిమా షూటింగ్ పూర్తి
- ముఖ్య పాత్ర పోషిస్తున్న దర్శకుడు
- దర్శకుడు క్రిష్ కు ఎన్టీఆర్ అవార్డు
* 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా ఓ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. మలయాళ చిత్రం 'తంగమలై డైరీస్' ఆధారంగా తెలుగులో రూపొందుతున్న 'ఫలక్ నూమా దాస్' చిత్రంలో తరుణ్ నటిస్తున్నాడు. ఆమధ్య 'మహానటి' సినిమాలో కూడా ఈయన ఓ పాత్ర పోషించాడు.
* ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ప్రముఖ దర్శకుడు క్రిష్ కు ఎన్టీఆర్ పేరిట ఏర్పాటైన అవార్డును ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను హైదరాబాదులోని ఎన్టీఆర్ కళా పరిషత్తు ఈ అవార్డుకు క్రిష్ ను ఎంపిక చేసింది. ఈ నెల 30న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.