'విశ్వాసం' విడుదలకి రంగం సిద్ధం
- అజిత్ హీరోగా 'విశ్వాసం'
- సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
- జనవరి 10వ తేదీన విడుదల
గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. తమిళనాట హీరోగా అజిత్ కి .. హీరోయిన్ గా నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. చాలా గ్యాప్ తరువాత ఈ ఇద్దరూ కలిసి నటించడం వలన కూడా ఈ సినిమాపట్ల క్రేజ్ పెరగడానికి కారణమైంది. సంక్రాంతికి తెలుగులో గట్టిపోటీ ఉండటం వలన, కొంత గ్యాప్ తీసుకుని తెలుగులో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.