'రెచ్చిపోదాం బ్రదర్' అంటోన్న వెంకటేశ్
- అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
- రేపు సాయంత్రం లిరికల్ సాంగ్ వీడియో
- సంక్రాంతికి భారీస్థాయి విడుదల
రేపు సాయంత్రం 5 గంటలకు ఫుల్ వీడియో లిరికల్ సాంగ్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒకే రకమైన సూటు .. బూటుతో ఈ పోస్టర్లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు. ఎక్కడా యాక్షన్ కి చోటులేకుండా .. పూర్తి వినోదభరితంగా అనిల్ రావిపూడి ఈ కథ రాసుకున్నాడు. అంతే ఫన్ తో ఈ సినిమాను రూపొందించాడు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉండటంతో, ఈ సినిమా సంక్రాంతి బరిలో సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలు వున్నారు.