తెలుగు తెరకి యథార్థ ప్రేమకథా చిత్రం .. 'తారామణి'
- తమిళంలో హిట్ కొట్టిన 'తారామణి'
- తెలుగులోనూ అదే పేరుతో
- సెప్టెంబర్ 21వ తేదీన విడుదల
వసంత్ రవి .. అంజలి .. ఆండ్రియా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. చెన్నైలో జరిగిన ఒక యథార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. అక్కడి యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో నచ్చడంతో కాసుల వర్షం కురిసింది. దాంతో అదే పేరుతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత డి. వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.