ఇప్పట్లో నయనతారకి తిరుగులేనట్టే .. మరోసారి భారీ హిట్
- నయనతార ప్రధాన పాత్రగా 'కొలమావు కోకిల'
- కామెడీని కలుపుకుని సాగే థ్రిల్లర్ మూవీ
- త్వరలోనే తెలుగులోను విడుదల
నయనతార నటన పట్ల అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'లేడీ సూపర్ స్టార్' అనే బిరుదును ఈ సినిమాతో ఆమె సార్థకం చేసుకుందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. 25 కోట్ల రూపాయల ఖరీదు చేసే డ్రగ్స్ ను తన కుటుంబ సభ్యులతో కలిసి నయనతార ఎలా తరలించిందనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. కావలసినంత కామెడీని కలుపుకుని సాగే థ్రిల్లర్ మూవీ ఇది. త్వరలో 'కో కో కోకిల' అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.