మొత్తానికి విక్రమ్ కుమార్ తోనే బన్నీ మూవీ ఖాయమైంది
- కథతో బన్నీని ఒప్పించిన విక్రమ్ కుమార్
- కథానాయికల కోసం అన్వేషణ
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
ఈలోగా, త్రివిక్రమ్ తో చేయాలనే ఉద్దేశంతో బన్నీ ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే, బన్నీ తదుపరి సినిమా విక్రమ్ కుమార్ తోనే వుండనుందనేది తాజా సమాచారం. ఇటీవలే సెకండాఫ్ కి మెరుగులు దిద్ది, చెప్పిన విక్రమ్ కుమార్ ఆఖరుకి బన్నీని ఒప్పించాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయికల అన్వేషణలో ఉన్నారట .. త్వరలోనే కథానాయికల పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.