'శతదినోత్సవం'లో మహేష్, చరణ్ సినిమాల హంగామా!
- 100 రోజులు ఆడిన 'భరత్ అనే నేను', 'రంగస్థలం'
- 6 కేంద్రాల్లో ఆడిన మహేష్ బాబు చిత్రం
- 15 కేంద్రాల్లో రామ్ చరణ్ సినిమా వంద రోజులు
రామ్ చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' ఓ అద్భుతమైన హిట్ గా నిలువగా, మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన 'భరత్ అనే నేను' బ్యూటిఫుల్ మూవీగా నిలిచింది. ఈ రెండూ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి వారి అభిమానులు ఏ సినిమా ఎక్కువ సెంటర్లలో శతదినోత్సవాన్ని జరుపుకుందన్న లెక్కలు వేస్తున్నారు. 'భరత్ అనే నేను' 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, 'రంగస్థలం' 15 కేంద్రాల్లో ఈ ఘనతను సాధించింది. దీంతో ప్రిన్స్ పై చెర్రీదే పైచేయని మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.