'హ్యాపీ ఆవులు' పేరిట పాల వ్యాపారాన్ని ప్రారంభించిన సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు
- పాలు, కూరగాయల వ్యాపారంలోకి సురేష్ బాబు
- రసాయనాలు లేని స్వచ్ఛమైన పాల ఉత్పత్తి
- లీటర్ పాలు రూ.150
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులకు సేంద్రీయ ఆహారం, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని చెప్పారు. దీంతో, అవి స్వచ్ఛమైన (రసాయనాలు లేని) పాలను ఇస్తున్నాయని తెలిపారు. లీటరు పాలను రూ. 150కి విక్రయించాలని నిర్ణయించామని చెప్పారు. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో తాను ఈ పని చేయడం లేదని చెప్పారు. స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. తన ఫిలిం స్టూడియోను కూడా పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో స్టీలు సీసాలను వాడుతున్నామని చెప్పారు.