వారి హిట్‌లిస్టులో సినీనటుడు ప్రకాశ్ రాజ్ కూడా?.. 60 మందికి ప్రాణహాని!
- కొన్ని నెలల క్రితం గౌరీ లంకేశ్ హత్య
- నిందితుల విచారణలో కీలక విషయాలు వెల్లడి
- పలువురికి భద్రత కల్పించాలని నిర్ణయం
గౌరీ లంకేశ్ హత్య కేసులో పోలీసులకు చిక్కిన షార్ప్‌షూటర్ పరశురామ్ వాగ్మారే సిట్ ముందు ఈ విషయాలు తెలిపినట్లు సమాచారం. హిందూ మతాన్ని కించపరిస్తే తాము ఊరుకోబోమని ఆయన అన్నాడు. ఈ జాబితా బయటకు రావడంతో వారందరికీ భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు సిట్ లేఖ రాసింది. దీంతో నిడుమామిడి మఠం శ్రీ వీరభద్ర చెన్నమల్లస్వామితో పాటు నటుడు గిరీష్ కర్నాడ్, సాహితీవేత్తలు కేఎస్ భగవాన్, నరేంద్రనాయక్ లకు భద్రత కల్పించాలని సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.