దర్శకుడిగా విఘ్నేశ్ శివన్ .. నిర్మాతగా నయనతార
- మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో నయనతార
- దర్శకుడిగా విఘ్నేశ్ శివన్
- త్వరలో సెట్స్ పైకి
తమిళంలో లేడీ ఓరియెంటెడ్ కథలు రెడీ చేసుకున్న దర్శకులకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు నయనతార. అందుకు కారణం ఇప్పటివరకూ ఆ తరహా సినిమాల్లో నటన పరంగా ఆమె సాధించిన మార్కులు .. అవి రాబట్టిన వసూళ్లు అనే చెప్పాలి. అలా విఘ్నేశ్ శివన్ కూడా లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసి నయనతారకి వినిపించాడట. ఈ సినిమాలో కథానాయికగా నటించడానికి .. తానే నిర్మించడానికి నయనతార అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.