దసరా బరిలోకి అఖిల్ మూవీ?
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్
- కథానాయికగా నిధి అగర్వాల్
- ఫారిన్ లో మేజర్ షెడ్యూల్
వెంకీ అట్లూరి చేసిన పక్కా ప్లానింగ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ సాధ్యమైనంత త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉందనీ, దసరాకి విడుదల చేయాలనే ఉద్దేశంలో దర్శక నిర్మాతలు వున్నారని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టైటిల్ బాగుందనే ఫీడ్ బ్యాక్ కూడా అక్కినేని అభిమానుల నుంచి వచ్చినట్టుగా చెబుతున్నారు. అదే టైటిల్ ను ఖరారు చేస్తారేమో చూడాలి.