'కాలా' రిలీజ్ రోజున సెలవు ప్రకటించిన ఓ ఐటీ కంపెనీ!
- పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా'
- రేపే భారీ స్థాయిలో రిలీజ్
- అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి
ఉద్యోగుల ఆనందానికి అడ్డుపడటం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందట. తమ సంస్థ ఆ రోజుని సెలవుదినంగా ప్రకటించిన మాట నిజమేనని అందులో పనిచేస్తోన్న వారు అన్నారు. తమ సంస్థ పబ్లిసిటీ కోసం ఇలా చేయలేదనీ, రజనీ సినిమా పట్ల ఉద్యోగుల్లో గల ఉత్సాహాన్ని గుర్తించే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఇక రజనీ అభిమానులంతా కూడా ఈ సినిమా సృష్టించబోయే రికార్డుల గురించే చర్చించుకుంటున్నారు.