కర్ణాటక సంఘటనను పాలకులందరూ గమనించాలి: ప్రముఖ నటుడు రజనీకాంత్
- మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో రజనీకాంత్ భేటీ
- సుప్రీంకోర్టు జోక్యంతో ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది
- ఎన్నికల ప్రకటన తర్వాత నేను పోటీ చేసే విషయం చెబుతా
- ఇతర పార్టీలతో పొత్తు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను
కర్ణాటకలో జరిగిన ఈ సంఘటనను పాలకులందరూ గమనించాలని కోరారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయమై రజనీకాంత్ స్పష్టంగా చెప్పలేదు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పుడు ఈ విషయం స్పష్టం చేస్తానని, ఇతర పార్టీలతో పొత్తు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని స్పష్టం చేశారు.
కాగా, కావేరీ జలాల బోర్డు గురించీ ఆయన ప్రస్తావించారు. ఈ బోర్డు కర్ణాటక ఆధీనంలో కాకుండా, ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.