ఐవైఆర్ గారు, మీకు దణ్ణం పెడతాం.. ఈ రెండింటి జోలికి రాకండి!: హీరో శివాజీ ఫైర్
- మొన్నటి దాకా అమరావతిపై పడ్డారు
- ఇప్పుడు వెంకటేశ్వరస్వామిపై పడ్డారు
- ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తోసేయాలన్నదే ఆలోచన
ఐవైఆర్ గారూ, అసలు మీ సమస్య ఏమిటంటూ శివాజీ సూటిగా ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారిగా అన్నీ అనుభవించారని... ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ జీవితాన్ని అనుభవించవచ్చు కదా? అని అన్నారు. 'ఇప్పుడున్న ప్రభుత్వం పోయి, కొత్త ప్రభుత్వం వచ్చి, మీకు ఏదో ఒక పదవి ఇవ్వాలి... ఆ తర్వాత మరో ప్రభుత్వం వచ్చి, మరో పదవి మీకు ఇవ్వాలి'... ఇదే కదా మీ ఆలోచన? అని ప్రశ్నించారు. మీకు దణ్ణం పెడతాం.. అమరావతి, వెంకన్న స్వామి జోలికి రావద్దని విన్నవించారు.