బన్నీ స్టేజ్ పైకి రావడానికే 20 లక్షల ఖర్చు!
- ఈ నెల 29న ప్రీరిలీజ్ ఈవెంట్
- వెరైటీగా ప్లాన్ చేసిన టీమ్
- వచ్చేనెల 4వ తేదీన విడుదల
సాధారణంగా ఇలాంటి వేడుకల్లో హీరోలను ఆహ్వానించగానే మాములుగా స్టేజ్ పైకి వచ్చేస్తుంటారు. కానీ 'నా పేరు సూర్య' వేడుకలో స్టేజ్ పైకి బన్నీ ఎంట్రీ వెరైటీగా ఉండేలా ప్లాన్ చేశారట. ఈ సినిమా కంటెంట్ కి తగినట్టుగా .. జిమ్నాస్టిక్స్ ను జోడిస్తూ చేసే ప్రయోగంతో ఆయన స్టేజ్ పైకి వస్తాడట. ఇందుకు గాను దాదాపు 20 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సినిమాపై అంచనాలు పెరిగేలా .. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నారని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.