మహేశ్ హిట్ కొట్టేశాడంటున్న అభిమానులు .. సంబరాలు!
- ఈ రోజునే థియేటర్లకు 'భరత్ అనే నేను'
- విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్
- ఆనందంతో పొంగిపోతోన్న అభిమానులు
కొరటాల తయారు చేసిన బలమైన కథాకథనాలు .. మహేశ్ బాబు నటన .. ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అంటున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందనీ .. వేసవి సెలవుల కారణంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.