'నా పేరు సూర్య' నుంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్
- బన్నీ హీరోగా 'నా పేరు సూర్య'
- ఈ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్
- వచ్చేనెల 4న సినిమా రిలీజ్
'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో .. నాతో ఏదో అన్నావా.. " అంటూ ఈ పాట కొనసాగుతోంది. చక్కని లవ్ ఫీల్ తో అలా అలా సాగే ఈ పాట దృశ్యం పరంగా చూస్తే నిజంగానే బ్యూటీఫుల్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు. సిరివెన్నెల సాహిత్యం .. విశాల్ శేఖర్ సంగీతం అనుభూతి ప్రధానంగా .. ఆహ్లాదకరంగా కొనసాగుతూ హాయిని కలిగిస్తున్నాయి. ఈ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.