బన్నీ 'రంగస్థలం' చూడకపోవడానికి కారణం అదేనట!
- దుమ్మురేపేస్తోన్న 'రంగస్థలం'
- ప్రముఖుల ప్రశంసలు
- బన్నీ చూడకపోవడంతో సందేహాలు
అయితే బన్నీ ఈ సినిమా చూడటంలో ఆలస్యం కావడానికి కారణం ఉందట. ఒక వైపున 'నా పేరు సూర్య' షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాను చూడాలనే బన్నీ అనుకున్నాడట. అయితే ఈ సినిమాను తమ హోమ్ థియేటర్లో కాకుండా .. అంతా కలిసి థియేటర్ కి వెళ్లి జనం మధ్యలో చూద్దామని బన్నీతో తల్లి 'నిర్మల' అన్నారట. తల్లి కోరిక మేరకు .. అలాగే చేద్దామని బన్నీ చెప్పాడట. త్వరలోనే ఫ్యామిలీతో కలిసి థియేటర్లోనే బన్నీ ఈ సినిమాను చూడబోతున్నాడన్న మాట.