'నా పేరు సూర్య' ఆడియో రిలీజ్ డేట్ ?
- ముగింపు దశలో 'నా పేరు సూర్య'
- ఆడియో వేదిక విషయంలో ఆలోచన
- మే 4వ తేదీన భారీస్థాయి రిలీజ్
అయితే ఈ ఫంక్షన్ ను ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుందనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. హైదరాబాద్ లో ఈ ఫంక్షన్ జరిపితే రొటీన్ అవుతుంది. వైజాగ్ లో జరుపుదామని అనుకుంటే .. ఇంతకుముందే అక్కడ 'రంగస్థలం' ఫంక్షన్ జరిపారు. అందువలన 'నా పేరు సూర్య' వేడుకను 'తిరుపతి'లోగానీ .. కర్నూల్ లో గాని జరపాలనే ఆలోచనలో ఉన్నారట. ఎక్కడ నిర్వహించనున్నారనేది త్వరలోనే తేలనుంది. మే 4వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.