'నేల టిక్కెట్టు'కి 25 కోట్లు ముట్టజెప్పిన టీవీ ఛానల్!
- కల్యాణకృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'
- రవితేజ జోడిగా మాళవిక శర్మ
- మే 24వ తేదీన విడుదల
ఈ కారణంగానే ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ కి గట్టిపోటీ ఏర్పడిందట. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానల్ వారు ముందుకు వచ్చి ఈ సినిమా శాటిలైట్ హక్కులను .. డిజిటల్ హక్కులను .. హిందీ అనువాద హక్కులను సొంతం చేసుకుందట. ఇందుకుగాను సదరు ఛానల్ 25 కోట్లు చెల్లించినట్టు సమాచారం. మే 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, మాస్ అంశాలకి ప్రాధాన్యతనిస్తూ కల్యాణ్ కృష్ణ చేసిన ఈ సినిమా ఏ స్థాయి హిట్ కొడుతుందో చూడాలి.