'సవ్యసాచి'పై భారీ అంచనాలు .. ఫస్టు పంచ్ రేపే
- చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
- చైతూ జోడీగా నిధి అగర్వాల్
- కీలకమైన పాత్రలో భూమిక
ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఫస్టు పంచ్' పేరుతో రేపు ఉదయం (శుక్రవారం) 10 గంటల 30 నిమిషాలకి ఈ సినిమా నుంచి ఫస్టు పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ వదిలిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది. 'ప్రేమమ్' హిట్ తరువాత చందూ .. చైతూ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో, అందరిలోనూ ఎంతో ఆసక్తి వుంది.