నాని కోసం రెండు ప్రాజెక్టులు సిద్ధం .. దర్శకులు వీరే!
- 'కృష్ణార్జున యుద్ధం' చేస్తోన్న నాని
- స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న విక్రమ్ కుమార్
- లైన్లో వున్న హను రాఘవపూడి
నాని కోసం ఒక వైపున విక్రమ్ కుమార్ .. మరో వైపున హను రాఘవపూడి స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారట. ఎప్పటికప్పుడు కథా చర్చలు జరుపుతూ, మార్పులు చేర్పులు చేసుకుంటున్నారట. ఈ ఏడాది ఈ ఇద్దరి దర్శకులతో నాని చేయడమనేది ఖాయమైపోయింది. అయితే ఇద్దరు దర్శకులలో ఎవరి సినిమా ముందుగా సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.