మోహన్ బాబు చేసిన ఆ పాత్ర నాకు వస్తుందనుకున్నాను!: సీనియర్ నటుడు జీవా
- నాటకాలు ఎక్కువగా వేసేవాడిని
- మా నాన్నకి ఇష్టం వుండేది కాదు
- 'స్వర్గం నరకం' సినిమాకోసం స్క్రీన్ టెస్ట్ కి వెళ్లాను
- ఆ పాత్ర మోహన్ బాబుకు దక్కింది
"నేను నాటకాలు వేస్తున్న సందర్భంలోనే, 'స్వర్గం నరకం' సినిమా కోసం ప్రకటన పడితే వెళ్లాను. విజయ అండ్ వాహినిలో డైలాగ్ ఇచ్చి .. స్క్రీన్ టెస్ట్ చేశారు. అప్పుడు మోహన్ బాబు కూడా వచ్చారు. ఆ వేషం నాకే వస్తుందని అందరి నమ్మకం. కానీ కట్ చేస్తే .. ఆ వేషం మోహన్ బాబుకి వెళ్లింది. మోహన్ బాబును చూశాను .. మంచి పొడగరి .. మంచి కలర్ .. బ్రహ్మాండంగా వున్నాడు. ఆ పాత్రకి నాకంటే ఆయనే కరెక్ట్ అని అప్పుడు అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.