'నా పేరు సూర్య'కు 6 కోట్ల నష్టం.. ఎలాగంటే!
- అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య'
- కేరళ .. కన్నడ ప్రాంతాల్లో ఆయనకి మంచి ఫాలోయింగ్
- ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలకి మంచి డిమాండ్
తాజాగా 'నా పేరు సూర్య' సినిమాకి కూడా మంచి క్రేజ్ వుంది. ఈ కారణంగానే ఈ సినిమా 'ఫస్టు ఇంపాక్ట్' బయటికి రాకముందే ఒక సంస్థ 12 కోట్లకి డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. ఫస్టు ఇంపాక్ట్ బయటికి వచ్చిన తరువాత, ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దాంతో మరో సంస్థవారు వచ్చి డిజిటల్ రైట్స్ ఇవ్వమంటూ 18 కోట్లు ఆఫర్ చేశారట. అప్పటికే 12 కోట్లకి అగ్రిమెంట్ కూడా పూర్తికావడంతో, తొందరపడి 6 కోట్లు నష్టపోయామే అని ఫీలవుతున్నారట. ఇక మిగతా బిజినెస్ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారట.