'నా పేరు సూర్య' ఓ ఎమోషనల్ జర్నీ
- పాటలు .. ఫైట్స్ శాతం తక్కువే
- ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యత
- ఏప్రిల్ 27వ తేదీన విడుదల
సాధారణంగా అల్లు అర్జున్ సినిమాల్లో పాటలకు .. డాన్సులకు .. ఫైట్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆ స్థాయిలో ఈ సినిమాలో పాటలు .. ఫైట్లు ఉండవని తెలుస్తోంది. అలాగని చెప్పేసి ఆ లోటు తెలియదని అంటున్నారు. ఓ ఎమోషనల్ జర్నీలా ఈ సినిమా కొనసాగుతుంది గనుక, అది ఆడియన్స్ ను ఆద్యంతం కట్టిపడేస్తుందని చెబుతున్నారు. దేశ రక్షణ కోసం ఆరాటపడే ఓ సైనికుడిగా అల్లు అర్జున్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండటం కష్టమనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.