బాలీవుడ్ శృంగార తారకు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్ లో సన్నీ!
- మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీలో సన్నీ మైనపు విగ్రహం
- కొలతలు తీసుకున్న టుస్సాడ్స్ టీమ్
- ఎంతో గర్వంగా ఉందన్న సన్నీ
మేడమ్ టుస్సాడ్స్ లో తన ప్రతిరూపాన్ని పెడుతుండటంపై సన్నీ సంతోషం వ్యక్తం చేసింది. తాను ఎంతో థ్రిల్ కు గురయ్యానని చెప్పింది. టుస్సాడ్స్ టీమ్ కు ధన్యవాదాలు తెలిపింది. మ్యూజియంలో తన ప్రతిరూపాన్ని చూసేందుకు తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇది తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. ఇప్పటికే ఈ మ్యూజియంలో నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, హృతి రోషన్, సచిన్, కపిల్ దేవ్, సల్మాన్ ఖాన్ తదితరుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి సరసన సన్నీ కూడా చేరబోతోంది.