తమిళంలో భారీస్థాయిలో 'జై సింహా' రీమేక్!
- బాలకృష్ణ డాన్సులు అదుర్స్
- మరింత హ్యాండ్సమ్ గా ఆయన కనిపిస్తారు
- ముందుగా అనుష్కను అనుకున్నాం
తాజాగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో బాలకృష్ణ డాన్సులు ఆయన అభిమానులకు పండగ చేస్తాయని చెప్పారు. గత చిత్రాల్లోకంటే ఈ సినిమాలో బాలకృష్ణ హ్యాండ్సమ్ గా కనిపిస్తారని అన్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నామనీ, అయితే దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తామని చెప్పారని అన్నారు. ఈ కారణంగానే ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేయడం లేదని అన్నారు. ముందుగా ఈ సినిమా కోసం అనుష్కను అనుకున్నామనీ, ఆమె డేట్స్ కుదరకపోవడం వలన నయనతారను ఎంపిక చేసుకున్నామని చెప్పుకొచ్చారు.