ఫస్టు ఇంపాక్ట్ పేరుతో బన్నీ స్పెషల్ టీజర్!
- షూటింగ్ దశలో 'నా పేరు సూర్య'
- జనవరి 1న ఫస్టు ఇంపాక్ట్
- 80 సెకన్ల నిడివిగల స్పెషల్ టీజర్
దాంతో ఫస్టు ఇంపాక్ట్ అంటే ఏమిటి? ఫస్టు లుక్కా .. ఫస్టు టీజరా? అనే సందేహం అందరిలో తలెత్తింది. తాజాగా ఫస్టు ఇంపాక్ట్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఫస్టు ఇంపాక్ట్ పేరుతో స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారట. 80 సెకన్ల నిడివి గల ఈ స్పెషల్ టీజర్ ను జనవరి 1న వదలనున్నారు. డైలాగ్స్ లేకుండగా అల్లు అర్జున్ పాత్రపై ఈ టీజర్ ను కట్ చేస్తున్నారని సమాచారం. ఇది స్పెషల్ టీజర్ అనీ .. అసలైన టీజర్ ప్రమోషన్స్ లో భాగంగా వస్తుందనేది యూనిట్ సభ్యులు చెబుతోన్న మాట.