శ్రీవిష్ణుకి పెరుగుతోన్న అవకాశాలు .. కొత్త చిత్రం 'తిప్పరా మీసం'!
- శ్రీవిష్ణుకు దక్కుతోన్న సక్సెస్ లు
- వరుసబెడుతోన్న అవకాశాలు
- దర్శకుడు విజయ్ కి ఓకే
- త్వరలోనే పూర్తి వివరాల వెల్లడి
ఇక రీసెంట్ గా వచ్చిన 'మెంటల్ మదిలో' ఆయనని పూర్తిస్థాయి హీరోగా నిలబెట్టేసింది. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ మార్క్స్ కొట్టేసిన ఆయనకి అవకాశాలు వరుసబెడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన దర్శకుడు విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో విజయ్ .. నారా రోహిత్ హీరోగా 'అసుర' సినిమా చేశాడు. ఇటీవల ఆయన శ్రీవిష్ణుకి కథ చెప్పేసి ఓకే అనిపించేసుకున్నాడు. ఈ సినిమాకి 'తిప్పరా మీసం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.