శ్రీవిష్ణు క్రేజ్ ను మరింతగా పెంచే 'మెంటల్ మదిలో'!
- ఈ రోజే థియేటర్స్ కి వచ్చిన 'మెంటల్ మదిలో'
- శ్రీ విష్ణు నటనకు ప్రశంసలు
- మంచి భవిష్యత్తు ఉందంటోన్న ప్రేక్షకులు
కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన మనసును కదిలించి వేయడం ఖాయమని చెబుతున్నారు. కచ్చితంగా ఇది శ్రీ విష్ణును ప్రేక్షకులకు మరింత చేరువ చేసే సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మిగతా యువ కథానాయకులకు శ్రీ విష్ణు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ దర్శక ప్రతిభకు .. నిర్మాతగా రాజ్ కందుకూరి అభిరుచికి ఈ సినిమా అద్దం పడుతుందని అంటున్నారు.