హీరోయిన్ల పారితోషికం పెరగాలి .. నయనతారకి దక్కుతున్నదీ తక్కువే!: రకుల్ ప్రీత్ సింగ్
- హీరోయిన్స్ కు ముడుతోన్న పారితోషికం తక్కువే
- నయనతారకి దక్కుతున్నది తక్కువ పారితోషికమే
- నా శ్రమకి తగినట్టుగానే నేను తీసుకుంటున్నాను
అలాంటి కథానాయికల్లో కొంతమంది .. హీరోలతో పోలిస్తే తమకి వచ్చే పారితోషికం తక్కువనే ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. తాజాగా ఆ జాబితాలో రకుల్ కూడా చేరిపోయింది. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార అందుకుంటున్న పారితోషికం కూడా 3 కోట్లకి మించకపోవడం గురించి రకుల్ ప్రస్తావించింది. హీరోయిన్ల పారితోషికం పెరగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక తాను అందుకుంటోన్న పారితోషికం తన శ్రమకి తగినదనే చెప్పుకొచ్చింది.