ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కు 'నో' చెప్పిన చై హీరోయిన్!
- చైతూ సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్
- ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ ను తిరస్కరించిన నిధి
- ఎంత డబ్బిచ్చినా చేయనంటూ స్పష్టీకరణ
తాజాగా ఈ జాబితాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. నాగచైతన్య సినిమా 'సవ్యసాచి'తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నిధి అగర్వాల్ కూడా ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కు 'నో' చెప్పింది. ఎంత డబ్బు ఇచ్చినా... ఫెయిర్ నెస్ క్రీములకు ప్రచారకర్తగా పని చేయనని స్పష్టం చేసిందట. 'మున్నా మైఖేల్' సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన ఈ భామ... బాలీవుడ్ లో మంచి మార్కులే కొట్టేసింది. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండటంతో... ఈమెకు బ్రాండ్ అంబాసడర్ గా పలు ఆఫర్లు వస్తున్నాయి.