'క్వీన్' రీమేక్ విషయంలో నేను అనుకున్నదే జరిగింది : డైరెక్టర్ నీలకంఠ
- హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 'క్వీన్'
- తెలుగు రీమేక్ లో తమన్నా
- దర్శకుడిగా నీలకంఠ
" హిందీ 'క్వీన్' వెరీ బ్యూటిఫుల్ మూవీ .. గ్రేట్ స్క్రిప్ట్" అని ఆయన అన్నారు. "తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కోసం అక్కడక్కడా చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేస్తాను"అని చెప్పారు. "నిజానికి నాకు రీమేక్ లు చేయడం నచ్చదు. కానీ హిందీ 'క్వీన్' చూసినప్పుడు మాత్రం ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనిపించింది" అన్నారు. "ఇక ఈ ప్రాజెక్టు అటు తిరిగి .. ఇటు తిరిగి తన దగ్గరికే రావడం కో ఇన్సిడెంట్" అని చెప్పుకొచ్చారు.