యువరాజ్ పేరు వాడుకుని డబ్బులు వసూలు చేయాలని చూస్తోంది: ఆకాంక్షపై యువరాజ్ తల్లి ఆగ్రహం
- కోడలిపై మండిపడిన యువరాజ్ సింగ్ తల్లి
- ప్రతిసారీ యువీ అరెస్టయ్యాడా? అన్న ప్రశ్నలతో చిత్రవధ అనుభవిస్తున్నాం
- ఆకాంక్ష పెట్టిన గృహహింస కేసు విచారణ నేడే ప్రారంభం
ఇంత వరకు పలు ఇంటర్వ్యూల్లో యువీ తనకు సోదరుడిలా ఉండేవాడని ఆకాంక్ష చెప్పిందని ఆమె గుర్తు చేశారు. అలాంటి యువరాజ్ పై ఆమె కేసు పెట్టే ప్రయత్నం చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువరాజ్ పేరు వాడుకుని డబ్బులు వసూలు చేయాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. అందుకే తమ కుటుంబంపై ఆకాంక్ష గృహహింస కేసు నమోదు చేయించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆకాంక్ష ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు యువీ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నేడే పోలీసు విచారణ ప్రారంభం కానుంది.