వచ్చే ఏడాదిలోనే నాని 'కృష్ణార్జున యుద్ధం'
- నాని తాజా చిత్రంగా రానున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
- ఆ తరువాత సినిమాగా 'కృష్ణార్జున యుద్ధం'
- దర్శకుడిగా మేర్లపాక గాంధీ
- కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే విదేశాలలో షూటింగ్ జరుపుకుని వచ్చింది. నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా ఆయన సరసన ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. గత రెండేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ వస్తోన్న నాని, వచ్చే ఏడాది ఈ సినిమాతోనే ప్రేక్షకులను పలకరించనున్నాడన్న మాట.