ఉచితంగా సినిమాలు చూసే సౌకర్యం కల్పించిన వొడాఫోన్!
టెలికాం మార్కెట్లో జియో తాకిడిని తట్టుకోవడానికి గత జనవరిలో వొడాఫోన్ ప్రత్యేకంగా 'వొడాఫోన్ రెడ్' అనే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ప్రీపెయిడ్ వినియోగదారులకు కూడా జియో తరహాలో కొన్ని ఆఫర్లను ప్రవేశపెట్టేందుకు వొడాఫోన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, ఐడియా వంటి టెలికాం కంపెనీలు ఈ బాటలో పయనించిన సంగతి తెలిసిందే.