షాకిస్తోన్న అల్లు శిరీష్ మూవీ శాటిలైట్ రైట్స్!
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను 4.5 కోట్లతో సన్ నెట్ వర్క్ వారు దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అల్లు శిరీష్ మూవీ శాటిలైట్ రైట్స్ కి ఈ స్థాయిలో రేటు పలకడం ఇదే మొదటిసారి అంటున్నారు. అల్లు శిరీష్ ఇంతకుముందు చేసిన 'శ్రీరస్తు శుభమస్తు' హిట్ అయినప్పటికీ, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో వి.ఐ.ఆనంద్ కొట్టిన హిట్ కారణంగానే ఈ స్థాయి రేటు లభించిందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.