లోనావాలా ప్యాలెస్ లో 'జై లవ కుశ' షూటింగ్!
అక్కడున్న ఒక ప్యాలెస్ లో ఎన్టీఆర్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఇక్కడ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. రెండవ టీజర్ ను వచ్చే నెల మొదటివారంలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ టీజర్ ద్వారా 'లవ' పాత్రను పరిచయం చేయనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .