ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
- తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న చంద్రబాబు
- ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య
- తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదన్న చంద్రబాబు
ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే మహిళలకు 33 శాతం సీట్ల ప్రకటనను నారా లోకేశ్ చేశారని చంద్రబాబు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేది టీడీపీ సిద్ధాంతమని... ఎన్టీఆర్ ఇచ్చిన ఆ సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని చెప్పారు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప చరిత్రలో మరెవరికీ సాధ్యం కాలేదని అన్నారు. సినీ చరిత్రలో ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయం లేదని... ఆయన చేసిన పాత్రలు మళ్లీ చేయాలంటే ఆయనే మళ్లీ పుట్టాలని వ్యాఖ్యానించారు.