రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ
- సీఎం, గవర్నర్ మాత్రమే కూర్చునేలా లోక్‌భవన్ నిబంధనలు
- నిబంధనలు పక్కనబెట్టిన నేతలు
- సతీశన్‌తో వేదిక పంచుకున్న రాహుల్, ప్రియాంక
- పినరయి విజయన్, రాజీవ్ చంద్రశేఖర్‌కూ స్టేజ్ పైనే సీట్లు
- నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి
సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా వేదికపైకి వచ్చి కూర్చున్నారు. వీరితో పాటు ప్రతిపక్ష నేత పినరయి విజయన్, సీపీఐ బినోయ్ విశ్వం, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్‌కు కూడా స్టేజ్‌పైనే సీట్లు కేటాయించారు. దీంతో లోక్ భవన్ ఆదేశాలు పూర్తిగా పక్కనబెట్టినట్లయింది.
ఈ కఠినమైన ప్రొటోకాల్స్ వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకత్వం ఆరోపించింది. రాహుల్ గాంధీ, ఖర్గేలను స్టేజ్‌పైకి రానివ్వకుండా చేయడానికే ఈ నిబంధనలు పెట్టారని మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని, హోంమంత్రులు ఇలాగే వేదికలను పంచుకుంటారని కాంగ్రెస్ గుర్తుచేసింది. లోక్ భవన్ వైఖరి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని విమర్శించింది.