నా వ్యాఖ్యలను వక్రీకరించారు: జస్టిస్ సూర్యకాంత్
- నకిలీ, బోగస్ డిగ్రీలతో వృత్తిలోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు వెల్లడి
- కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన
- భారత యువత పట్ల తాను గర్వపడుతున్నానన్న జస్టిస్ సూర్యకాంత్
భారతీయ యువత పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. నిన్న ఓ కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిన తీరును చదివి తాను ఆవేదన చెందానని పేర్కొన్నారు.
మన దేశ యువతను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారమని అన్నారు. మన దేశ యువతను చూసి ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తన పట్ల వారికి గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు. యువతను దేశాభివృద్దికి మూలస్తంభాలుగానే చూస్తానని సూర్యకాంత్ తెలిపారు.