విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి
- శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్
- మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి
- హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రాక
- గన్నవరం నుంచి మంగళగిరి వరకు భారీ స్వాగతానికి ఏర్పాట్లు
ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి వెళ్తారు. ఉదయం 11:30 గంటలకు ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పవన్ రాక సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరి వరకు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.