నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని నిరూపించారు: విజయ్ కి బాలకృష్ణ అభినందనలు
- తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయంపై బాలకృష్ణ ప్రశంసలు
- నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని వ్యాఖ్య
- విజయ్‌ను ఎంజీఆర్, తన తండ్రి ఎన్టీఆర్‌లతో పోల్చిన బాలయ్య
- బెంగాల్, అసోం విజయాలపై బీజేపీ, ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు
- మోదీ, అమిత్ షా నాయకత్వంలోనే నవభారత నిర్మాణం సాధ్యమని వ్యాఖ్య
"నటుడు తలచుకుంటే చరిత్రను తిరగరాయగలడని తమిళనాట ఎం.జి.ఆర్ గారు, తెలుగునాట మా నాన్నగారు, తెలుగుజాతి అన్నగారు ఎన్టీఆర్ గారు నిరూపించారు. మళ్లీ ఆ ప్రభంజనాన్ని గుర్తుచేసిన సోదరుడు విజయ్‌ను అభినందిస్తున్నాను" అని బాలకృష్ణ పేర్కొన్నారు. తమిళ ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడమే లక్ష్యంగా విజయ్ రాజకీయ ప్రస్థానం సాగాలని ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో విజయం సాధించిన బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలకు కూడా బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నాయకత్వంలోనే నూతన భారత నిర్మాణం సాధ్యమని తాను నమ్ముతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.