హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- గత కొంతకాలంగా పవన్ కు అనారోగ్య సమస్యలు
- ఇటీవలే హైదరాబాద్‌లో శస్త్రచికిత్స
- హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు
- శస్త్రచికిత్స నేపథ్యంలో తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచన
- తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై క్లుప్తంగా చర్చించుకున్నట్లు సమాచారం. తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.